తెలుగుదేశం ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రకటించిన "రైతన్న మీకోసం" కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకి టిడిపి నేతలు వెళుతుంటే రైతులు ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. రైతులను అన్ని విధాలా ముంచిన కూటమి ప్రభుత్వం, సినిమా టైటిల్స్ పేరిట మరో ప్రచార ఆర్భాటం చేస్తుందన్నారు. వెంకటాచలం మండల కేంద్రంతో పాటు, తోటపల్లి గూడూరు మండలం ఈదూరు, మాచర్లవారిపాళెం గ్రామాలలో సోమవారం సాయంత్రం ఆయన పర్యటించారు. చంద్రబాబు రైతులకు ఈ రెండేళ్లల