ఆదోని: ఆదోనిలో గుడిసె దగ్ధం, కుమారుడి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు, నగదు అగ్నికి ఆహుతి అయ్యాయి
Adoni, Kurnool | Nov 1, 2025 ఆదోని బండిమెట్టలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో బండారి వీరేశ్ గుడిసె దగ్ధమైంది. ఉదయం పనులకు వెళ్లిన తరువాత విద్యుత్ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు మంటలను ఆర్పివేశారు. ఇంటి నిర్మాణం, కుమారుడి పెళ్లి కోసం దాచుకున్న రూ.5.45 లక్షల నగదు, 4 తులాల బంగారం, వెండి ఆభరణాలు, బట్టలు, నిత్యావసర సరుకులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయని, తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.