కుప్పం: బంగారు ఆభరణాలు స్వాధీనం, నిందితుడు అరెస్ట్ : డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్
రామకుప్పం మండలంలోని చెల్దిగానిపల్లిలో జరిగిన చోరీ కేసును చేధించినట్లు డీఎస్పీ పార్థసారథి, కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ శనివారం తెలిపారు. చోరికి పాల్పడిన తమిళనాడుకు చెందిన రాజేంద్రన్ ను అరెస్టు చేశామన్నారు. నిందితుడి వద్ద సుమారు 123 గ్రాముల బంగారు, కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగతనాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.