ప్రొద్దుటూరు: రాజుపాలెం మండలం వేల్లాల గ్రామం వద్ద కుందూ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ వృద్ధ దంపతులు
Proddatur, YSR | Oct 25, 2025 కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా వృద్ధ దంపతులు నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కడప జిల్లా రాజుపాలెం మండలం వెల్లాల గ్రామం వద్ద చోటుచేసుకుంది. జమ్మలమడుగు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన రామ సుబ్బారెడ్డి,నాగమునమ్మ అనే వృద్ధ దంపతులు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్లాల గ్రామం వద్ద ఉన్న కుందూ నదిలో దూకారు. వారు నదిలోకి దూకడాన్నీ గమనించిన స్థానికులు హుటాహుటిన నది వద్దకు వెళ్లగా కొట్టుకుపోతున్న రామసుబ్బారెడ్డి ని స్థానికులు కాపాడి బయటకు తీశారు. నాగమున్నెమ్మ నీటి ఉదృతికి కొట్టుకుపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు