మైనింగ్ రాయల్టీ పెంపు పై డోన్ లో రాస్తారోకు
Dhone, Nandyal | Nov 12, 2025 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మైనింగ్ రాయల్టీ ప్రైవేటీకరణ, పెంపునకు వ్యతిరేకంగా బుధవారం పారిశ్రామిక యజమానులు, కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. రాయల్టీ రూ.250 నుంచి రూ.1050కి పెంచడం పరిశ్రమలపై భారమై, మూతపడే పరిస్థితికి దారితీస్తుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.