భీమవరం: కొవ్వాడ పుంతలో రూ. 40 లక్షల విలువైన ఎల్ఎస్ఈడీ స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్లు దొంగలించిన దుండగులు, ఫిర్యాదు చేసిన బాధితుడు
భీమవరం మండలం కొవ్వాడ పుంతలో రూ. 40 లక్షల విలువైన ఎల్ఎస్ఈడీ స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్లు, ఇతర సామగ్రిని దుండగులు దొంగిలించారు. ఈ ఘటన గత ఆదివారం జరగగా, బాధిత వ్యాపారి బి. మాధవకృష్ణ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదాం తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్లు ఆయన తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్లో దొంగలు కనిపించారని, తక్షణమే న్యాయం చేయాలని మాధవకృష్ణ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులను కోరారు.