అనంతపురం నగరంలో డ్రోన్ ద్వారా పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక నిఘాను పెట్టామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆయా ప్రాంతాలను డ్రోన్ కెమెరాతో ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగిందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ కోసం సాంకేతిక పరిజ్ఞానంతో నిఘాను పెంచుతున్నట్లు వెల్లడించారు. నేరాల నియంత్రణకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.