బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత :జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు స్వప్న ,ప్రియదర్శిని
Nandyal Urban, Nandyal | Nov 12, 2025
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత అని జిల్లా చైల్డ్ ప్రొటెక్ట్ ఆఫీసర్లు స్వప్న, ప్రియదర్శిని పేర్కొన్నారు. బుధవారం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన తనిఖీల్లో భాగంగా నంద్యాలలోని శ్రీనివాస సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ పలు ప్రాంతాల్లో చదువు మధ్యలో ఆపివేసి పనులు చేసుకుంటున్న విద్యార్థులను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలలు ఎక్కడైనా పనిచేస్తే సమాచారం ఇవ్వాలన్నారు. శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు.