చిలకలూరిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.తిరుపతికి చెందిన వైద్యుడు,తిరుపతి నుంచి గుంటూరు వైపు వెళుతుండగా డివైడర్ను ఢీకొనడంతో వైద్యుడు,అతని చిన్నారి కుమార్తె మృతి చెందారు.ప్రమాదంలో కారు నడుపుతున్న వైద్యులు తంగేళ్ల వెంకట కిషోర్ (42) అక్కడికక్కడే మృతి చెందగా,తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుమార్తె అశ్వినందన మృతి చెందింది.ప్రమాద సమయంలో కారులో ఉన్న ఐదుగురు కుటుంబ సభ్యులు ఉండగా మిగిలిన వారికి స్వల్ప గాయాలైయ్యాయి.