ఐఓడీ సంస్థ నుంచి నారా భువనేశ్వరి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున డిస్టింగ్విస్ట్ ఫెలోషిప్ 2025 అవార్డు హెరిటేజ్ ఫుడ్స్ ఎండి హోదాలో గోల్డెన్ పీకాక్ అవార్డు స్వీకరించడం పట్ల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.