గంగారం: మండలలో ఈనెల 15న సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చిన మహిళ అధ్యక్షురాలు స్రవంతి..
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలాల గిరిజన నాయకులతో ఈరోజు ఆదివారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు సేవాలాల్ సేన మహిళా జిల్లా అధ్యక్షురాలు స్రవంతి నాయక్ సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 15వ తేదీన కొత్తగూడ గంగారం మండలంలో హర్ ఘార్ బొగ్ బండారో నిర్వహించాలని కోరారు.. మండలంలో రాజకీయ నాయకులు రాజకీయాలకు అతీతంగా జయంతి ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. మండలాల్లోని ఉపాధ్యాయులు ఇతర ఇతర శాఖలో పనిచేసే ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా సెలవు తీసుకొని జయంతి ఉత్సవాలలో పాల్గొనాలని అన్నారు.