వెంకటాపుర్: గట్టమ్మ సమీపంలో రోడ్డు ప్రమాదం, ట్రాలీ వాహనం - లారీ ఢీ, ఇద్దరికి గాయాలు
ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ దేవాలయం వద్ద జాతీయ రహదారిపై మూల మలుపు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేడు గురువారం రోజున సాయంత్రం 7 గంటలకు మేడారం వైపు నుండి వస్తున్నటువంటి తడి చెత్త - పొడి చెత్త సేకరించే ట్రాలీ వాహనం మరియు హన్మకొండ వైపు నుండి వస్తున్న లారీ రెండు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ట్రాలీలో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా స్థానికులు గమనించి 108 సాయంతో ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటన స్థలానికి ములుగు ఎస్సై వెంకటేశ్వర్లు ప్రమాద ఘటనను పరిశీలిస్తున్నారు.