బ్రహ్మచారి అలంకరణలో నందవరం చౌడేశ్వరి దేవి
బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవికి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు బ్రహ్మచారిణి అలంకరణలో ప్రత్యేకంగా అలంకరించారు. దీప దూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ప్రధాన అర్చకుడు అమ్మవారికి సహస్ర దీపాలంకరణ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.నిర్వాహకులు ప్రసాదాలు పంపిణీ చేశారు.