మేడ్చల్: కుత్బుల్లాపూర్ లో ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధి సూరారంలో హార్ట్ అండ్ మిల్క్ కంపెనీలో లేబర్ కాంట్రాక్టర్ గా పనిచేసే లూనా మేది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 20 మంది లేబర్ మూడు నెలల జీతం వాడుకోవడం వల్ల లేబర్ పదేపదే డబ్బులు గురించి అడగడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న సూరారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.