కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో స్వచ్ఛత-హి- సేవ కార్యక్రమాలు : కోఆర్డినేటర్ డాక్టర్ మంజుల
కృషి విజ్ఞాన కేంద్రం, కలికిరి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వచ్ఛత –హి- సేవలో భాగంగా కె.వి.కె కలికిరిలో మరియు జిల్లాలోని వివిధ గ్రామాలలో కేవికే సమన్వయకర్త డాక్టర్ కె.మంజుల మరియు ఇతర శాస్త్రవేత్తలు పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కేవికేలోని సిబ్బందితో స్వచ్ఛత హి సేవ మరియు స్వచ్ఛ ఆంధ్ర గురించి సోమవారం సాయంత్రం 4గంటలకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సమన్వయకర్త మంజుల మరియు శాస్త్రవేత్తలు తమ సిబ్బందితో కేవికే లోని నిల్వ గదులను, గోడౌన్స్ ను శుభ్రం చేశారు. గ్రామాల్లోని ప్రజలకు పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తున్నారు.