రాజపేట: రఘునాధపురంలో అప్పుల బాధ కాలనీతో యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండలం, రఘునాధపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రఘునాథపురం గ్రామానికి చెందిన గడ్డమీది మల్లేశం కుమారుడు రాజు (25(అని యువకుడు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం బయటికి వెళ్ళొస్తానని చెప్పి తన బైక్ పై వెళ్లి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆదివారం తెల్లవారుజామున తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా పశువుల కొట్టంలో మంచంపై మృతి చెంది ఉన్నాడని మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సోమవారం మధ్యాహ్నం రాజపేట పోలీసులు తెలిపారు.