ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావడంతో పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Nov 11, 2025
ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించిన నేపథ్యంలో ఆయన పర్యటన విజయవంతం అయ్యేలా చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. మంగళవారం జిల్లాలోని పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించి ఎంఎస్ ఎంఈ పార్కులను ప్రారంభించారు. సభ ప్రాంగణానికి చేరుకునే సమయంలో సీఎం చంద్రబాబును కలెక్టర్ రాజబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందించారు. దాదాపు 750 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామని సీఎం పర్యటన విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.