మహానందిలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు . 31 రోజుల నుండి ఆదాయం 32 లక్షల 29 వేల రూపాయలు
మహానంది దేవస్థానంలో ఉభయ ఆలయాల నుండి లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.. 31 రోజుల్లో హుండీ ఆదాయం 32 లక్షల 29 వేల రూపాయలు రాబడినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.ఈ లెక్కింపు కార్యక్రమంలో భక్తులు,అధికారులు, శివసేవకులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు నిఘానేత్రంలో, అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు మధ్య లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.