కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ అన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆయన మాట్లాడుతూ.. కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 9న దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్రం తెచ్చిన లేబర్ కోర్టులను వెంటనే రద్దు చేయాలన్నారు. సింగరేణి లాభాలను ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా పంపిణీ చేయాలని కోరారు.