తరిగొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు ముందస్తు టి.బి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టిన వైద్యులు
గుర్రంకొండ మండలం తరిగొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రస్తుతం టి. బి. (క్షయ )వ్యాధికి మందులు తింటూ చికిత్స లో ఉన్న రోగుల కాంటాక్ట్స్ (కుటుంబ సభ్యులు, రోగితో సన్నిహిత సంభందం గల వారు మరియు షుగర్ వ్యాధితో ఉన్నవారు, పొగ త్రాగే వారు, మద్యపానం సేవించువారు, క్యాన్సర్, డయాలసిస్, ఎత్తుకు తగ్గ బరువు లేనివారు, దీర్ఘ కాలిక వ్యాధుల తో బాధపడుతూ మంచానికే పరిమితం అయిన వారికి సోమవార సి.వై.టీబి పరీక్షను తరిగొండ పీ. హెచ్. సి.వైద్యులు డాక్టర్ విజయ్ మరియు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, టీబి పర్యవేక్షకులు నాగిరెడ్డి నిర్వహించారు. సోమవారం ఒక్కరోజే 50 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు