మండల పరిసర ప్రాంతంలో పశువులకు గాలి కుంట టీకాలు
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పరిసర ప్రాంతాలలో గాలికుంటు టీకాల కార్యక్రమంలో భాగంగా సోమవారం పెద్ద కారంపల్లి పంచాయతీ పరిధిలోని ములక్కాయల పల్లె గ్రామం నందు మరియు రాజంపేట పట్టణ పరిధి లోని నూనెవారిపల్లి నందు సుమారు 284 పశువులకు గాలికుంటు టీకాల కార్యక్రమంను రాజంపేట ఉప సంచాలకులు డా.వై విజయభాస్కర్ రావు ఆధ్వర్యంలో టీకాలను వేయడం జరిగింది. ఇందులో భాగంగా రాజంపేట సహాయ సంచాలకులు డా. కె ప్రతాప్ మాట్లాడుతు గాలికుంటు వ్యాధి టీకాల ఆవశ్యకతను వివరించడం జరిగింది.