గుడిపాల ఇటుక బట్టీలలో బందీలైన 23 మందికి జాయింట్ కలెక్టర్ విద్యాధరి చొరవతో విముక్తి
Chittoor Urban, Chittoor | Sep 26, 2025
గుడిపాల: ఇటుక బట్టీలో బంధీలైన 23 మందికి ఎట్టకేలకు విముక్తి లభించింది. వివరాలు.. గుడిపాల మండలం, గట్రాళ్లమిట్ట గ్రామంలో ఇర్పాన్ అనే అతను ఇటుక బట్టీల వ్యాపారం చేస్తున్నాడు ఇతని వద్ద 2013లో తమిళనాడు రాష్ట్రం, వేలూరుకు చెందిన 18 మంది, బంగారుపాళ్యం మండలానికి చెందిన ఐదుగురు ఎస్టీ కాలనీ వాసులు పనులకు వచ్చారు. అప్పట్లోనే ఇర్పాన్ వారికి అడ్వాన్స్‌గా రూ.5 వేలు ఇచ్చి పనిలో పెట్టుకున్నారు. అప్పటి నుంచి వారిని బంధీలుగా మార్చేశారు. ఇందులో ఆరుగురు మగవారు, మరో ఆరుగురు మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నారు. వీరందరూ రోజూ ఇటుకలకు సంబంధించి మట్టి కలపడం, మోల్డింగ్ చేయడం, ఇటుకలను కాల్చడం, ఇటుకలు రవ