నారాయణ్‌ఖేడ్: జుజాల్పూర్ శివారులో బావిలో పడి అశోక్ రెడ్డి అనే 40 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య, మృతదేహాన్ని పైకి తీయించిన పోలీసులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుజాల్పూర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల అశోక్ రెడ్డి అనే వ్యక్తి గురువారం ఉదయం గ్రామ శివారులో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బావి ఒడ్డుపై చెప్పులు, సెల్‌ఫోన్ ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి నారాయణఖేడ్ ఎస్సై రాశుల శ్రీశైలం, పోలీసు సిబ్బంది చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. అశోక్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.