మహాకవి గురజాడ జయంతిని రాష్ట్ర పండుగ లా నిర్వహించాలి: విజయనగరంలో జిల్లా పౌర వేదిక అధ్యక్షులు బిశెట్టి బాబ్జి
Vizianagaram Urban, Vizianagaram | Sep 15, 2025
సెప్టెంబర్ 21వ తేదీన జరగనున్న మహాకవి గురజాడ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగలు నిర్వహించాలని ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని, సోమవారం విజయనగరంలో జిల్లా పౌర వేదిక అధ్యక్షులు బి శెట్టి బాబ్జి టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున ను కోరారు. ఈ మేరకు జిల్లా పౌర వేదిక ప్రతినిధులతో కిమిడి నాగార్జునను విజయనగరంలో కలసి వినతి పత్రాన్ని బిసెట్టి బాబ్జి అందజేశారు.