ప్రకాశం జిల్లాలో అక్రమ అరెస్టులు అంటూ మాట్లాడుతున్న వైసిపి నాయకులపై సామాజికవేత వెంకట రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిద్దలూరులో ఇటీవల జరిగిన అరెస్టును అక్రమం అంటూ మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడడంపై అభ్యంతర వ్యక్తం చేశారు. పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని వైసిపి నాయకులకు హితవు పలికారు. ఆదివారం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.