కొవ్వూరు: బుచ్చిలో పూడికతీత పనుల పరిశీలించిన బుచ్చి ఛైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, కమిషనర్ బాలకృష్ణ
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ముంబయి జాతీయ రహదారికి ఇరువైపులా ఆక్రమణలు తొలిగించారు. అలాగే కాలువలో పూడికతీత పనులు మూడు రోజులుగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నగర పంచాయతీ ఛైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, కమిషనర్ బాలకృష్ణ సంబంధిత పనులను బుధవారం పరిశీలించారు. పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు.