వనపర్తి: పెండింగ్ లో ఉన్న 8300 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయాలని వనపర్తి ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం
మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ముట్టడి ధర్నా కార్యక్రమం చేపట్టిన ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ రేవంత్ సర్కార్ స్కాలర్షిప్లు విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందని యాజమాన్యాలకు కొమ్ముకాస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 8300 కోట్ల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు.