దర్శి: దర్శిలో ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకారం
Darsi, Prakasam | Sep 14, 2025 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా బొగ్గరపు సుబ్బారావు కార్యదర్శిగా మువ్వల శ్రీనివాసులు కోశాధికారిగా లక్ష్మీనరసింహారావు నియమితులయ్యారు. అనంతరం వారి ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.