తిరుమలగిరి సాగర్: సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేయాలి: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే కొందురు జైవీర్ రెడ్డి
నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డితో కలిసి బుధవారం మధ్యాహ్నం సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా తూకాల విషయంలో సరిగ్గా ఉండేలా చూడాలని చెప్పారు. మండలంలో ఖాళీగా ఉన్న చౌక ధర దుకాణాల ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.