నారాయణ్‌ఖేడ్: ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మంత్రులను రోడ్లపైకి రానీయం: సంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి దత్తు
విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి దత్తు రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన నారాయణఖేడ్‌లో మాట్లాడుతూ ప్రభుత్వం బకాయిలు 8500 కోట్లను వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో తెలంగాణలో ఎమ్మెల్యేలు మంత్రులను రోడ్లపైకి రానీయమని హెచ్చరించారు. ప్రజా పాలన అని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.