పెళ్లకూరు వద్ద హైవేపై రెండు ప్రైవేట్ బస్సులు
- డ్రైవర్ కు స్వల్ప గాయాలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం దిగువ వాలి హైవేపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు మరో ప్రైవేట్ బస్సు ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక ఉన్న బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. గాయాలు పాలైన డ్రైవర్ను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంతో కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.