రాయదుర్గం: వాణీవిలాస్ సాగర్ ప్రాజెక్టు నిండి భైరవానితిప్ప ప్రాజెక్టు వైపు కొనసాగుతున్న వరదనీటి ప్రవాహం
గుమ్మగట్ట మండలంలోని భైరవానితిప్ప ప్రాజెక్టు వైపు కర్నాటక నుండి వరదనీటి ప్రవాహం పెరిగింది. కర్నాటక లో కురుస్తున్న వర్షాలకు ఆ రాష్ట్రంలోని హిరియూరు సమీపంలో ఉన్న వాణీవిలాస్ సాగర్ డ్యాం నిండింది. దీంతో ఆ డ్యాం నుంచి మరువ పారుతోంది. దీంతో ఆ నీరు ఏపి సరిహద్దు వైపు పరుగులు పెడుతోంది. మంగళవారం ఉదయం నుండి ఆ నీటి ప్రవాహం కొనసాగుతోంది. రెండు రోజుల్లో బిటి ప్రాజెక్టు లోకి చేరే అవకాశం ఉందని ఏఈ హరీష్ తెలిపారు.