నగరంలో ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్
Eluru, Eluru | Apr 3, 2024 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ స్థానిక శనివారపేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. ఈ వసతి గృహంలో బాలలకు అందుతున్న వసతులపై, ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. శుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ పడొద్దని, పరిశుభ్రతను పాటించాలని నాణ్యమైన పోషక ఆహార పదార్థాలను అందించాలని, తద్వారా బాలురు ఆరోగ్యంగా ఉండి చదువును అభ్యసించడానికి, క్రమశిక్షణలో ఉండటానికి తోడ్పడుతుందని సూచించారు.