కోడుమూరు: గుండ్రేవులలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
సి.బెలగల్ మండలంలోని గుండ్రేవుల గ్రామంలో శుక్రవారం రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో రైతులకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. రైతు కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ పెట్టుబడి వ్యయం తగ్గించుకోవాలని రైతులకు సూచించారు.