అసిఫాబాద్: ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరికరాలు ఉన్నా, వైద్యులు లేరు: బాధితుల ఆవేదన
ASF జిల్లా ప్రభుత్వాసు పత్రిలో గర్భిణీలకు అవసరమైన సేవలను అందించడానికి వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నా..సంబంధిత వైద్యులు, టెక్నీషియన్లు లేక అవి మూలాన పడ్డాయని బాదితులు ఆరోపించారు. గురువారం ఆసిఫాబాద్ ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..ఆసిఫాబాద్ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు స్కానింగ్ కోసం బయటకు వెళ్ళాల్సి వస్తోందని,దీంతో వారు ఆర్థికంగా నష్టపోతున్నారని వాపోయారు. గతంలో కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు పిర్యాదు చేసిన కూడా నేటి వరకు రేడియాలజిస్ట్ వైద్యులను నియమించలేదన్నారు. ఇప్పటికైనా రేడియోలజీ వైద్యులను నియమించి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.