రాయదుర్గం: పట్టణంలోని కెటిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రాయదుర్గం కే.టీ.ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2004- 2008 డిగ్రీ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అప్పటి గురువులు హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు కళాశాల జీవితాన్ని, గత జ్ఙాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం కళాశాలకు సరస్వతి విగ్రహాన్ని బహుకరించారు. కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపక బృందం పూర్వ విద్యార్థుల దాన గుణానికి అభినందనలు తెలియజేశారు.