రామంతపూర్ మండల ప్రాథమిక పాఠశాలలో సిబ్బంది, వసతుల కొరత సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం పాఠశాలను వారు సందర్శించారు. విద్యా వాలంటీర్లు, అదనపు నీటి కనెక్షన్, యూరినల్ మరమ్మత్తులు, ఎండిఎం షెడ్, మూడు అదనపు గదుల ఏర్పాటు సమస్యను ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారు శ్రీవాణి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.