ఓటు హక్కును కాపాడటానికి పోరాడాలి: ఏపీపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల
దేశ ప్రజల ఓటు హక్కును కాపాడటానికి పోరాడాల్సిన అవసరం వచ్చిందని పీఏసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి అన్నారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. భారత రాజ్యాంగం మనకు ఓటు హక్కు, మన నాయకులను ఎన్నుకునే స్వేచ్ఛ కల్పించిందని తెలిపారు. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఈసీకి ఉందని, ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఈసీ నిర్వహించాలన్నారు. నేటి నుంచి అక్టోబర్ 15 వరకు సంతకాల సేకరణ చేపడతామని చెప్పారు.