జమ్మలమడుగు: జమ్మలమడుగు : ఆర్టీసీ డిపోలోని ట్రాఫిక్ మరియు గ్యారేజీ సమస్యలపై సమావేశం
కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీసీ డిపోలో ట్రాఫిక్ మరియు గ్యారేజ్ సమస్యలపై బుధవారం డిపో మేనేజర్,నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు సమావేశం నిర్వహించారు. డిపోలోని ట్రాఫిక్ మరియు గ్యారేజీ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఇచ్చిన మెమొరాండంపై డిపో మేనేజర్ పివి ప్రవీణ్, అసిస్టెంట్ మెనేజర్ సుబ్బమ్మ మరియు గ్యారేజీ ఎయంయఫ్ కంబగిరి స్వామితో సుదీర్ఘంగా జరిపిన చర్చలపై సానుకూలంగా స్పందించారని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు తెలిపారు.