తాడిపత్రి: తాడిపత్రిలో ధన్వంతరి జయంతి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిలను నిర్వహించిన బిజెపి నేతలు
ధన్వంతరి జయంతి సందర్భంగా బిజెపి నేతలు నాయి బ్రాహ్మణ సోదరులతో కలిసి కరపత్రాల విడుదల చేశారు అలాగే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించారు. ధన్వంతరి జయంతిని సంజీవిని స్వరం పేలిన ఈనెల 18 అంగరంగ వైభవంగా తిరుపతి గాంధీభవన్ వద్ద నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులు కళాకారులు వైద్యులతో సమావేశాలు నిర్వహించి అందరిని సంఘటితం చేస్తామని బిజెపి నేతలు తెలిపారు. కార్యక్రమంలో రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్లన్న గారి రామాంజనేయులు బిజెపి నేతలు పాల్గొన్నారు.