కొవ్వూరు: కోవూరులో కోడిపందాల స్థావరంపై దాడులు ఐదుగురు అరెస్ట్
కోవూరు (M) పోతిరెడ్డిపాలెం గ్రామ పరిధిలోని పెన్నానదిలో ఆదివారం కొంత మంది కోళ్ల పందేలు రహస్యంగా నిర్వహిస్తుండగా ఎస్ఐ రంగనాథ్ గౌడ్ దాడి చేశారు. ఇందులో భాగంగా ఐదుగురిని అదుపులోకి తీసుకుని 8 బైకులు, 1 ఆటో, 3 కోడి పుంజులు, రూ.1,500 నగదు సీజ్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపలపై ఉక్కపాదం మోపుతున్నట్లు ఆయన తెలిపారు.