నల్గొండ: ప్రకాశం బజార్లో తెగిపడిన సర్వీస్ వైర్ తప్పిన ప్రమాదం
నల్లగొండ జిల్లా కేంద్రంలోని వాతావరణం మార్పుతో బలమైన ఈదురు గాలులు వీస్తూ ఓల్డ్ కలెక్టరేట్ ప్రకాశం బజార్ సమీపంలో సోమవారం రాత్రి తెగిపడిన సర్వీస్ వైర్ అదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో ఎవరు లేనందున ఎటువంటి ప్రాణప్రాయం జరగలేదు. పెద్ద ఎత్తున ట్రాన్స్ఫార్మర్లు పేలినట్టు శబ్దాలు రావడంతో వ్యాపారస్తులు స్థానికులు ఉలిక్కిపడ్డారు .అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు వెంటనే కరెంటు తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ శాఖ అధికారులు తెగుబడిన సర్వీస్ వైర్లు తొలగించి కరెంటు కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు తెలిపారు.