జిల్లాలోని రైతాంగానికి పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేసి వారి అభ్యున్నతికి పెద్ద ఎత్తున కృషి చేయాలని ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి పిలుపునిచ్చారు. పిఎసిఎస్ ఉద్యోగుల నూతన కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు.