మార్కాపురం: చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం గోడపత్రికను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వైయస్సార్ పార్టీ కార్యాలయం నందు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మరియు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 19వ తేదీన చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం చలో మెడికల్ కాలేజీ గోడపత్రికను ఆవిష్కరించారు.