పూతలపట్టు: బంగారుపాళ్యం మండలంలో రోడ్డు ప్రమాదం డ్రైవర్ మృతి
బంగారుపాళ్యం మండలంలోని మొగలిఘాట్ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుండి చెన్నై వైపు వెళ్తున్న లారీ, ముందుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొనడంతో లారీ ముందు భాగం ధ్వంసమైంది. డ్రైవర్ కూరుకుపోవడంతో పోలీసులు జెసిబి సహాయంతో బయటకు తీశారు. ఆయన రెండు కాళ్లు విరగడంతో 108 అంబులెన్స్ ద్వారా బంగారుపాళ్యం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంతో రహదారిపై వాహనాలకు అంతరాయం కలగగా, క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.