తరిగొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు గర్భవతులకు బాలింతలకు స్వస్తి నారి స్వశక్తి పరివార్ కార్యక్రమం పై అవగాహన
వాల్మీకిపురం ప్రాజెక్టు పరిధిలోని గుర్రంకొండ మండలం తరిగొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు పోషణ మాసోత్సవాల సందర్భంగా తల్లులకు గర్భవతులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ భారతి, పాల్గొని మాట్లాడుతూ గర్భవతులు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరు నెలలు పూర్తి అయ్యి 7వ నెల నుండి బిడ్డకు ఎటువంటి అనుబంధ పోషకాహారం పెట్టాలి అనే విషయాన్ని వివరించారు.తరిగొండ పిహెచ్ సి డాక్టర్ చిన్న రెడ్డప్ప మాట్లాడుతూ స్వస్తి నారి శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం గురించి వివరించారు. అనంతరం ఆరు నెలలు పూర్తయిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.