అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఆక్రమణలు తొలగించి రోడ్డు వెడల్పు చేయాలని సీపీఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీపీఎం పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రోడ్డు ఆక్రమణలను తొలగించి రోడ్లు విస్తరించాలని మున్సిపల్ మేనేజర్ రాధకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ పట్టణం విస్తారంగా పెరిగిందని వాటికి అనుగుణంగా రోడ్లు వెడల్పు కాలేదన్నారు. రోడ్లు ఇరుకుగా ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.