జిల్లాలో నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మీడియాకు ప్రకటనలో తెలిపారు. బాణసంచా విక్రయ లైసెన్స్ కల్గిన దుకాణదారులు మాత్రమే అమ్మాలని మిగితా ఎవరు విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దీపావళి పురస్కరించుకుని జిల్లాలో టపాసుల అక్రమ విక్రయాలు జరుగకుండా ఉండేందుకు లైసెన్స్ కల్గిన దుకాణదారులు పాటించాల్సిన నియమ నిబంధనలు ప్రజలు, పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై ఆయన శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.