యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి తల నీలాల వేలంపాటలో రూ.2.45 లక్షలు ఆదాయం
బనగానపల్లె మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం నిర్వహించిన తలనీలాల వేలం పాటల ద్వారా రూ.2,45,000 ఆదాయం లభించిందని ఈవో పాండురంగారెడ్డి తెలిపారు. చాగలమర్రికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి అత్యధిక మొత్తానికి వేలం పాడి, తలనీలాలను పోగు చేసుకునే హక్కును పొందారని ఆయన చెప్పారు. పర్యవేక్షకులు బ్రహ్మానందరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.