కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పెనమలకుదురు గ్రామంలో గురువారం సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు జరిగాయి. ఈ సందర్భంగా మాట పట్టింపులు పెరిగి ఇరు వర్గాలు పిడుగుదులతో దాడులు చేసుకున్నాయి. స్థానికంగా ఉన్న నాయకులు కలగజేసుకొని ఇరు వర్గాలను శాంతింప చేశాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఘటనలో ఎంతమంది గాయపడ్డారో వివరాలు తెలియవలసి ఉంది.